How to control Fall army warm in maize - మొక్కజొన్న లో కత్తెర పురుగు యాజమాన్యం పద్దతులు

 


మొక్కజొన్నలో fall army warm యాజమాన్య పద్దతులు

మన రాష్ట్రంలో ప్రధానంగా ఖరీప్ మరియు రబీలో రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారు . గత సంవత్సరాల నుండి మొక్కజొన్నను లద్దెపురుగు జాతికి చెందిన కొత్తపురుగు అయిన స్పోడోప్టెరా పూజి పెర్గా ఆశించి చాలా నష్ట పరుస్తోంది . ఈ పురుగును ఇంగ్లీషులో " ఫాల్ ఆర్మీ వార్మ్ అని లేదా తెలుగులో కత్తెర పురుగు అని అంటారు .

◆  పురుగు జీవిత చక్రం : అదే కత్తెర పురగు జీవిత కాలంలో సుమారు 1500 2000 వరకు గ్రుడ్లు పెడుతుంది . సుమారు 100-200 గుడ్లను సముదాయంగా ఆకుల క్రింది భాగంలో మరియు కాండం పై భాగంలో గుడ్లను పెడుతుంది . ఈ గుడ్లు ముదురు పసుపు రంగులో వుండి 2-3 రోజులకు పగిలి తొలిదశ లార్వాలు మొక్కజొన్న ఆకు పత్ర హరితాన్ని గోకి తినుట వలన ఆకులపై తెల్లని పొర ఏర్పడుతుంది . ఎదిగిన లార్వాలు ముదురు గోధుమ వర్మంలో వుండి , తలపై తెల్లని తలక్రిందులుగా " పై " ఆకారపు గుర్తు కలిగి , తోక వైపు నాలుగు నల్లని చుక్కలను చతురస్రాకారంలో కలిగి వుంటుంది . ప్యూపాలు ( కోశస్థదశ ) నేలలో సుమారు 2 నుండి 8 సెం.మీ లోతులో వుండి , 20-30 రోజులలో ఆ దశను పూర్తి చేసుకుంటుంది .

◆ రెక్కల పురుగులు గోధుమ మరియు బూడిద రంగు
మిళితమైన వర్ణంలో వుండి తెల్లటి , పలుచటి క్రింద రెక్కలు  కలిగి వుంటుంది . రెక్కల పురుగుల 7 నుండి 21 రోజులు బ్రతికి వుంటుంది.


◆ పురుగు నష్టపరిచే విధానం:-
మొదటి దశ లార్వాలు పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులపై తెల్లని పొర ఏర్పడుతుంది . రెండు మరియు మూడు దశ లార్వాలు ఆకు సుడులలో వుండి రంధ్రాలు చేసుకుంటూ తినడం వలన విచ్చుకున్న ఆకుల్లో వరస రంద్రాలు ఏర్పడి , పురుగు , విసర్జించిన పసుపు పచ్చని గులికలను గుడులలో గమనింపవచ్చును . 

◆ ఎదిగిన లార్వాలు ఆకులను వెలుపలి నుండి లోపలివైపు తినివేస్తూ పూర్తిగా ఆకులను తిని ఈనెలను మాత్రమే మిగులుస్తాయి , మరియు కండె పొరలను తొలుగుకుంట రంద్రాలు చేసి లోపలి గింజలు ఆశించి నష్ట పరుస్తుంది.
పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు:-
పంట విత్తేముందు లోతైన దుక్కి చేయాలి . సమయానికి మొక్కజొన్నను విత్తుకోవాలి . ఆలస్యంగా విత్తిన మొక్కజొన్నను పురుగు ఎక్కువగా ఆశిస్తుంది . మొక్కజొన్నలో అంతర పంటలను పప్పు ధాన్యాలను సాగు చేయడం ద్వారా మిత్ర పురుగులైన పరాన్న జీవులు పెరిగి పురుగును అదుపులో వుంచుతాయి .

 Native parasitoids which have potential to reduce invasive fall armyworm population SOLU 

◆ పురుగు గ్రుడ్లు పెట్టుటకు ఆకర్షించే నేపియర్ గడ్డిని మొక్కజొన్న చుట్టూ నాలుగు వరుసలలో సాగు చేసి గ్రుడ్ల సముదాయాన్ని నాశనం చేయాలి . లేత మొక్కజొన్నలో ( 30 రోజుల లోపు ఎకరానికి 8-10 వరకు లింగా కర్షక బుట్టలను పైరుపై ఒక అడుగుపై వరకు వుండునట్లు అమర్చుకోవాలి.

◆ పురుగు గమనించిన వెంటనే పొడి ఇసుకను మొక్కజొన్న నుడులలో ఆ సమయానికి వేసుకున్నచో  ఇసుక రాపిడికి లార్వాలు చనిపోతాయి . అవసరమైనచో క్రింద తెలిపిన మందులను మార్చుతూ 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి . తీపి కండె రకాలలో మందు పిచికారి చేసిన 15 రోజుల వరకు కండెలను 30 రోజుల లోపు 1-5 శాతం పురుగు ఆశించిన మొక్కలు గమనించిన వెంటనే వేపనూనె ( అజారీరక్టిన్ ) 1500 పిపియం . - 5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి . బి.టి. పార్ములేషన్ 2 గ్రా క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి .
31-35 రోజులలోపు 6-10 శాతం పురుగు ఆశించిన మొక్కలు గమనించిన వెంటనే :

౼ స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేదా 

౼ ఇండాక్సికార్చ్ 1 మి.లీ లేదా 

౼ ఇమామెక్టిన్ బెంజయేట్-  0.1 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.


పురుగు ఉధృతి ఎక్కువగా వుంటే : 

౼ క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ లేదా 

౼ఇండాక్సి కార్డ్స్ 1.మి.లీ 

౼ చాలామా సైహలోద్రిన్ 0.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి లేదా విషపు ఎరను మొక్కజొన్న సుడిలో ఉదయం లేదా సాయంకాలం వేసుకోవాలి .


విషపు ఎర తయారీ విధానం :


ఎకరానికి 10 కిలోల తవుడు , 2 కిలోల బెల్లం తీసుకొని బెల్లంను 2-3 లీటర్ల నీటిలో కరిగించిన తర్వాత తవుడులో కలిపి 24 గంటల పులియనిచ్చి అరగంట ముందు ఈ మిశ్రమానికి 100 గ్రాల ధయోడికార్బ్ మందును కలిపి చిన్న చిన్న వుండలు వేసి మొక్కజొన్న సుడిలో వేసుకోవాలి .

 
65 రోజుల పైబడిన పంటలో:-
పురుగు మందులు పిచికారి చేయడం కష్టం మరియు మందులు పెద్దగా పనిచేయవు . ఎదిగిన లార్వాలను మనుషులతో పరించి కిరోసిన్ డబ్బాలో వేసి చంపి వేయాలి . విషపు ఎరను నేపియర్ గడ్డిని వేసుకోవాలి . రబీలో సాగు చేసే మొక్కజొన్న , జొన్న , చిర ధాన్యపంటలు , న్నలో 130 రోజుల వేరుశనగ , ఉల్లి , టమోటా , ఆలుగడ్డ , క్యాబేజి లాంటి పంటలను బట్టలను పైరుపై కూడా ఈ పురుగును ఆశించి నష్టపరిచే అవకాశం ఉన్నది . కావున దేవాలి . పురుగు రైతులు ఈ పురుగు పట్ల అప్రమత్తంగా వుండాలి

Post a Comment

0 Comments