Rice fallow pulse crop techniques get more pulses yield

 వరి మాగాణిలో పెసర మినుము పంటలు సంరక్షణ 

వరి  మాగాణిలో మినుము పెసర పంటను ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా సాగు చేస్తున్నారు ప్రస్తుతం మాగాణిలో రైతులు  మినుము పెసర వెదజల్లడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పురుగులు తెగుళ్లు ఆశించిన స్థాయి కలగజేసే అవకాశం ఉన్నందున పైర్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన మేరకు సంరక్షణ చర్యలు తీసుకోవచ్చు.

 పురుగుల సమగ్ర యాజమాన్యం 

 తామర పురుగు

  పైరు తొలి దశలో ఎక్కువగా ఆశించి ఆకుల రసాన్ని పీల్చడం వలన ఆకులు పైకి ముడుచుకు పోతూఉంటాయి. 10 నుంచి 15 శాతం నష్టాన్ని కలిగించడమే కాకుండా ఆకుముడత తలమాడు వైరస్ తెగులు కూడా వస్తాయి.

 వీటియొక్క ఉధృతి వర్షాభావ/బెట్ట పరిస్థితులకు తోడు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ పురుగు1q ఉదృతి ఎక్కువగా ఉంటుంది.

 ఉదృతి ఎక్కువైనప్పుడు మొక్కలు గిడసబారి ఎండిపోతాయి 

 నివారణ 

 వీటి నివారణకు 1.5 m.l fipronil  లేదా ఒక గ్రాము ఎసిఫేట్ 75 sp  0.3 మిల్లీ లీటర్ల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి .

 తెల్ల దోమ :-

 ముఖ్యంగా అపరాలు పత్తి మిరప పొగాకు కూరగాయలు పండ్లను ఆశించి నష్టపరుస్తాయి.

 పగటి ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న తేమ అధికంగా ఉన్నప్పుడు తొలకరి వేసవిలో అపరాల పంటల మీద వీటి బెడద ఎక్కువగా ఉంటుంది.

  తెల్ల దోమ లో రెండు రకాలుగా నష్టాన్ని కలిగిస్తున్నాయి మొదట తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగుభాగాన చేరి రసం పీల్చడం  వల్ల మొక్కలు నిరసించి ఎదుగుదల తగ్గుతాయి తేనె లాంటి జిగట పదార్థాలు విసర్జించడం వల్ల మొక్కల భాగాలు మీద నల్లటి బూజు ఏర్పడుతుంది. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునే శక్తి కోల్పోడం వల్ల మొక్కలు ఎదుగుదల తగ్గిపోతాయి.

  రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగ చేయడమే కాకుండా అనేక రకాల పల్లాకు వైరస్ తెగుళ్లు ముఖ్యంగా ఇవి ఎక్కువగా వ్యాప్తి చేస్తాయి. పల్లాకు తెగులు కు సూచించిన సమగ్ర యాజమాన్యంతో ఈ యొక్క తెల్ల దోమ నివారణ చేపట్టాలి .

 పొగాకు లద్దే పురుగు:-

  తల్లి పురుగులు ఆకుల అడుగుభాగాన గుంపుగా గుడ్లను పెట్టి గోధుమ వెంట్రుకలతో కప్పి వేస్తుంది మొదటి దశలో గొంగళి పురుగులు ఆకుల అడుగుభాగాన సముదాయాలుగా ఉండి పచ్చదనాన్ని తినడం వల్ల జల్లెడ ఆకులు ఏర్పడుతాయి.

 పెరిగిన దశలో ఆకులను తిని ఈనెలను మాత్రమే మిగిలుస్తాయి .

 పెద్ద గొంగళి పురుగులు పగటి వేళ మట్టి  పెళ్లల కింద, భూమి నెర్రలో లేదా రాలిన ఆకుల కింద ఉండి విపరీతంగా నష్టపరుస్తాయి.

  నివారణ   :- 

  ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టి పురుగు ఉనికిని అంచనా వేయాలి ఒక్కో బుట్టలో రోజుకు 15 నుంచి 20 రెక్కల పురుగులు వరుసగా మూడు రోజులపాటు గమనిస్తే వెంటనే శశి రక్షణ చర్యలు చేపట్టాలి పురుగు తొలిదశలో మోనోక్రోటోఫాస్ 1.6 లేదా ఎసిఫేట్ వన్ గ్రామ్ లేదా క్వినాల్ ఫాస్ ఓ ఎమ్ ఎల్ లేదా క్లోరిపైరిఫాస్ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి




  తెగుళ్ళ సమీకృత యాజమాన్యం:-

 నేల ద్వారా ఆశించే తెగుళ్లు :-

మొదలుకుళ్లు లేదా కాండం కుళ్ళు తెగులు:-

 మొక్కలు మొదలు దగ్గర విరిగి చని పోతాయి. వేరు భాగం,పిల్ల వేర్లు  పూర్తిగా కళ్ళు పోతాయి.

 తెగులు సోకిన మొక్కలు పొలంలో వివిధ వివిధ భాగాల్లో కనిపిస్తాయి .

 మొక్క ఎండు తెగులు:-

  తడి గా ఉండే ఉప్పు  నేలల్లో  ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటిగ్రేడు ఉన్నప్పుడు ఈ శీలింద్రం త్వరగా అభివృద్ధి చెంది తెగులు కలుగజేస్తుంది .

  తెగులు సోకిన మొక్కలు కాండం భాగం కుళ్ళి విరిగిపోయి పోయి మొక్కలు చనిపోతాయి.

  

వేరు/ ఎండుకుళ్లు తెగులు:- తెగులు ఉధృతి ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటిగ్రేడు కన్నా ఎక్కువగా ఉండే నీటి ఎద్దడి మెత్తగా ఉన్న సమయాల్లో ఎక్కువగా ఉంటుంది తెగులు సోకిన మొక్కలను అక్కడక్కడ పొలాల్లో కనిపించే తెగులు  ప్రధాన లక్షణం. వేరు కుళ్లు  సోకిన మొక్కలను పీకి నప్పుడు మొక్క రాకుండా తల్లివేరు భూమిలోనే ఉంటాయి.. తల్లి వేరు ,పిల్ల వేరు కుళ్ళు పోయి నలుపు రంగు కి  మారుతాయి. శీలింద్రం బూజు పదార్థాము వేర్లు చుట్టుకొని ఉంటుంది. చనిపోయిన వేరు వ్యవస్థ గట్టిపడి వేరు పై పొరలు పగిలిపోతాయి.

 వడలు తెగులు లేదా ఎండు తెగులు:-

  ఈ తెగులు ఎక్కువగా వరి మాగాణిలో సాగుచేసే మినుము, పెసలు లో కనిపిస్తుంది. కాండం పై తెల్లని ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడి ఆకులు ముదురుబారి పోయి వంకర్లు  తిరిగి కిందకు ముడ్చుకుపోతాయి.

  ఆకులు పసుపు రంగుకు మారి ఓడిపోయి క్రమేపీ చనిపోతాయి.

  నివారణ/ యాజమాన్యం:-

వేసవికాలంలో భూమిని లోతుగా దుక్కి చేస్తే శీలింద్రం ,వాటి బీజాలు చనిపోతాయి.

ఒక వేళ అవకాసం ఉంటే 3 సంవత్సరాలు పంట మార్పిడి చేయాలి.

24-48 గంటలు ముందు విత్తనాన్ని వాలిడామిసిన్ 1 m.l  లేదా  కాప్టెన్ లేదా థైరామ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి.

100 కిలోలు చివికిన పశువుల ఎరువు + 20 కిలోల వేపపిండి మిశ్రమానికి 2 కిలోల ట్రెకోడెర్మ విరిడే కలిపి కుప్పగా ఎండ తగలని  నీడలో ఉంచాలి.25-30 రోజుల్లో ట్రెకోడెర్మ అభివృద్ధి చెందుతుంది. దీనిని పైరు విత్తుకునే సమయంలో తగినంత తేమ ,సేంద్రియ పదార్థాలు ఉన్నపుడు భూమి లో కలుపుకోవాలి.

Post a Comment

0 Comments